రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి

by Shyam |
రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి
X

దిశ, వెబ్‎డెస్క్: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచదేశాలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్‎కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవాక్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. తాజాగా హైదరాబాద్‎లోని నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‎లో భాగంగా 63 మంది వాలంటీర్లకు బూస్టర్ డోస్‎ను ఇచ్చారు. ఇక భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్‎కు సిద్ధమవుతోంది. ఈ కొవాక్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల సమాచారం.

Advertisement

Next Story