ముగిసిన రెండో డ్రై రన్

by vinod kumar |
ముగిసిన రెండో డ్రై రన్
X

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కోసం అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు శుక్రవారం రెండోసారి డ్రై రన్ నిర్వహించాయి. టీకాల సరఫరాలో ఎదురయ్యే సవాళ్లు, వ్యాక్సిన్ వేసే సిబ్బంది శిక్షణలో లోపాలు వంటివి లక్ష్యంగా రెండో డ్రై రన్ సాగింది. ఏ పద్ధతిలో టీకా పంపిణీ సరళంగా జరుగుతుందో పరిశీలించడానికి ఈ డ్రై రన్ నిర్వహించారు. మొత్తం 736 జిల్లాల్లో ట్రయల్ రన్ జరిగింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్‌లు ఈ డ్రై రన్‌లో పాల్గొనలేవు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శుక్రవారం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్, ఒమందురర్ ప్రభుత్వ ఆస్పత్రిలో డ్రై రన్‌ను పరిశీలించారు. ఇతర హాస్పిటళ్లతోపాటు పరిమేడులోని జనరల్ మెడికల్ స్టోర్ డిపోనూ పరీక్షించారు. రాష్ట్రానికి అవసరమైన టీకా డోసులు రెండు రోజుల్లో చేరనున్నట్టు కర్ణాకట ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కేరళ రాష్ట్రం వ్యాక్సినేషన్‌కు సంసిద్ధంగా ఉన్నదని ఆరోగ్య మంత్రి శైలజా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed