- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకలి చావులకు కారణం కావొద్దు
దిశ, మునుగోడు: చేనేత కార్మికులు తమ సమస్యలపై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పద్మశాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ హాజరై మాట్లాడారు.
చేనేత కార్మికుల ఆత్మహత్యలకు, ఆకలిచావులకు ప్రభుత్వం కారణం కాకూడదని, చేనేత కార్మికుల వద్ద నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికుల కుటుంబాలకు నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున జీవన భృతి చెల్లించాలని కోరారు.
జియో ట్యాగింగ్ లేని చేనేత కార్మికులందరికీ వెంటనే జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని, చేనేత సహకార సంఘాల వద్దనుండి టెస్కో కొనుగోలు చేసినా వస్త్రాల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరం లో మార్కండేయ దేవస్థాన కమిటీ అధ్యక్షులు చిలుకూరు అంజయ్య, పద్మశాలి కార్మిక సంఘం అధ్యక్షులు సూరేపల్లి భాస్కర్,కుచేలు, ఏలే నరసింహ,మేకని రామకృష్ణ,గుర్రం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.