- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానిలో రెండో ‘కరోనా’ కేసు..?
హైదరాబాద్: నగరంలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. హైటెక్ సిటీలోని ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువైన మైండ్ స్పేస్‌లోని డీఎస్ఎంలో పనిచేసే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కోవిడ్-19 టెస్ట్ పాజిటివ్‌గా వచ్చినట్టు సదరు కంపెనీ వెల్లడించింది. ఇటీవల ఇటలీ వెళ్లొచ్చిన తర్వాత బాధితుడికి ఈ లక్షణాలు కనిపించడంతో విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లి, స్వచ్ఛందంగా వైద్యులను సంప్రదించాడని పేర్కొంది. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకుని సదరు సంస్థ.. అందులోని ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశిస్తూ.. మెయిల్ పంపించింది. ఇప్పటివరకు అతనితో సన్నిహితంగా మెలిగిన వారికీ ఈ వ్యాధి సోకిందని అందులోని ఉద్యోగులు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం కంపెనీ పంపించిన మెయిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు.
Tags: carona, positive, covid-19, mindspace, hitech city, techie, DCM, hyderabad, mail, work from home