నిమ్మగడ్డ పాట్లు.. ఫిబ్రవరిలో ఎన్నికలు?

by Anukaran |   ( Updated:2020-12-10 22:13:37.0  )
నిమ్మగడ్డ పాట్లు.. ఫిబ్రవరిలో ఎన్నికలు?
X

దిశ, వెబ్ డెస్క్ : స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాడరాని పాట్లు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఈసీ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఆయన ఉన్నారు. ఎన్నికల నిర్వహణపై ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ ను కలిసిన రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఈ నేపథ్యంలోనే ఎస్‌ఈసీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు మరోసారి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నిమ్మగడ్డ మరోసారి లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అంతకుముందు నవంబర్ 23వ తేదీన సీఎస్‌కు నిమ్మగడ్డ మొదటి లేఖ రాశారు. ఈ సారి సీఎస్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు లేఖలు రాశారు. అయితే, అన్నింటిలో హైకోర్టు ఆదేశాలను ప్రస్తావించినట్లు నిమ్మగడ్డ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed