బీజేపీ, జనతాదళ్ మధ్య సీట్ల ఒప్పందం

by Shamantha N |
బీజేపీ, జనతాదళ్ మధ్య సీట్ల ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో బీజేపీ, జనతాదళ్ మధ్య సీట్ల భాగస్వామ్య ఒప్పందం ఖరారు అయినట్లు తెలుస్తోంది. మొదటి దశ నామినేషన్లు దాఖలుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సీఎం నితీశ్ కుమార్ నివాసంలో బీజేపీ బిహార్ యూనిట్ చీఫ్ భూపేంద్ర యాదవ్, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జీ ఫడ్నవీస్, ఇతర పార్టీ సీనియర్‌ నాయకులు చర్చలు జరిపి ఫైనల్ చేశారు. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 122 జనతాదళ్ (యునైటెడ్), మిగిలిన 121 సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుందని రాజకీయ వర్గాల నుంచి వినపడుతోంది. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని తీసుకున్న నిర్ణయం జాతీయ ప్రజాస్వామ్య కూటమిలోని సీట్ల స్వరూపాన్ని మార్చివేసింది.

Advertisement

Next Story