సెర్చ్ ఆన్ వెబ్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్

by Harish |
సెర్చ్ ఆన్ వెబ్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సాప్ ఫేక్ న్యూస్‌ని కట్టడి చేయడానికి త్వరలో ఒక కొత్త ఫీచర్‌ని తీసుకురాబోతుంది. సెర్చ్ ఆన్ వెబ్ పేరుతో ఒక బటన్‌ని అందించబోతోంది. దీని ద్వారా ఫార్వర్డ్ ద్వారా వచ్చిన సమాచారం అసలైనదా? నకిలీదా? అని తెలుసుకునే అవకాశం కలగబోతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్‌కి సంబంధించిన బీటా వెర్షన్‌ని అమల్లోకి తీసుకువచ్చింది. వాట్సాప్‌లో వచ్చిన టెక్స్ట్ లేదా వీడియోకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌లో వెంటనే సెర్చ్ చేసి దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

కరోనా వైరస్ లాంటి పాండమిక్ విస్తరిస్తున్న సమయాల్లో ఫార్వర్డ్ మెసేజ్‌లు లేనిపోని భయాందోళనలను సృష్టిస్తుంటాయి. ఇలాంటి మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయడానికి ఈ సెర్చ్ ఆన్ వెబ్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని, వీలైనంత త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ తన బ్లాగులో పేర్కొంది. ఇందుకోసం అన్ని దేశాల ప్రభుత్వాలు తీసుకుని అధికారిక సమాచారాన్ని ఇవ్వగలిగే శాఖల వివరాలను సేకరించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాట్సాప్ బాట్ ద్వారా కరోనాకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని యూజర్లకు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల కరోనా వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ హబ్‌ని కూడా వాట్సాప్ ప్రారంభించింది.

Advertisement

Next Story