ముఖ్యమంత్రి గారూ!.. తిరుపతిలో ఎయిర్ పోర్ట్‌లో తనిఖీల్లేవా?

by srinivas |
ముఖ్యమంత్రి గారూ!.. తిరుపతిలో ఎయిర్ పోర్ట్‌లో తనిఖీల్లేవా?
X

ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతోంది. దేశ విదేశాలు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అహర్నిశలు కష్టపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయి. ఊరందరిదీ ఒక దారి.. ఉలిపిరి కట్టది మరోకదారి అన్నట్టుంది తిరుపతి విమానాశ్రయం పరిస్థితి. దేశ విదేశాల నుంచి వెంకన్న భక్తులు తిరుమలను సందర్శించేందుకు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తారు. కనీసం 2,700 నంచి 3 వేల మంది ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు సాగిస్తారు. అలాంటి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రయాణీకులు స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించుకోవడం తప్పితే.. అధికారులు పరీక్షలు నిర్వహించకపోవడం విశేషం. ఎందుకిలా అని అడిగితే.. ఇక్కడికి డొమెస్టిక్ సర్వీసులే తప్ప విదేశీ విమానాలు రావడం లేదు కదా? అని నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నారు. సిబ్బంది మాత్రం మాస్కులు, గ్లౌజులు వాడుతూ, ప్రయాణీకుల సంరక్షణ గాలికొదిలేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags: tirupati airport, tirumala tirupati, renigunta airport, corona, screening tests, traveller

Advertisement

Next Story