500 ఏళ్ల తర్వాత తొలిసారి అమ్మకానికి ‘డీర్ ఐలాండ్’

by Anukaran |
500 ఏళ్ల తర్వాత తొలిసారి అమ్మకానికి ‘డీర్ ఐలాండ్’
X

దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ కాలం నుంచి చాలా దేశాల్లో ఒకే డాలర్‌కు ఇల్లు సొంతం చేసుకోవచ్చనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సారి అంతకుమించిన ఆఫర్ వచ్చింది. యూకేలోని స్కాటిష్ హైలాండ్స్‌లో ఉన్న డీర్ ఐలాండ్‌ను దాని యజమానులు వేలానికి పెట్టారు.

రణగొణ ధ్వనుల నగర జీవనానికి దూరంగా హ్యాపీగా జీవించాలనుకునేవారికి డీర్ ఐలాండ్ బెస్ట్ ఆప్షన్‌. దీని బిడ్డింగ్ ధర 111700 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇది లండన్‌లోని ఓ చిన్న అపార్ట్‌మెంట్ ధర కంటే తక్కువ. మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో అనేక జీవజాతులకు నిలయంగా ఉన్న ఈ ఐలాండ్ స్కాట్లాండ్‌కు పశ్చిమ తీరంలోని మారుమూల ప్రాంతంలో ఉందని ప్రాపర్టీ మేనేజర్ స్టీఫెన్ మెక్‌క్లస్కీ తెలిపారు. ‘5 శతాబ్దాలుగా వారసత్వంగా వస్తున్న ఈ డీర్ ద్వీపాన్ని 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇతరులకు విక్రయించడానికి సిద్ధమయ్యాం’ అని ఆయన పేర్కొన్నారు. నివేదికల ప్రకారం.. అధికారిక ఆన్‌లైన్ వేలం మార్చి 26 నుంచి ప్రారంభం కానుండగా, ఇప్పటికే కొంతమంది కొనుగోలుదారులు ఆసక్తిచూపిస్తున్నారని తెలియజేశారు. ఇక ఈ వేలంలో 209000 – 279000 డాలర్ల వరకు ధర పలికే అవకాశం ఉందని మెక్‌క్లస్కీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed