- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపైర్ స్టేట్ కన్నా ఎత్తయిన పగడపుదిబ్బ
దిశ, వెబ్‌డెస్క్ :
ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో శాస్త్రవేత్తలు భారీ పగడపు దిబ్బ(కోరల్ రీఫ్)ను కనుగొన్నారు. దాదాపు సంవత్సరం నుంచి సముద్రంలో అన్వేషిస్తున్న పరిశోధకులకు ఇది శుభవార్తనే చెప్పుకోవాలి. నార్త్ గ్రేట్ బారియర్ రీఫ్, సముద్రపు అడుగున ఓ రోబో సాయంతో ఎనిమిది రోజుల క్రితం కనుగొన్న ఈ పగడపు దిబ్బ.. ఎంపైర్ స్టేట్ భవనం, సిడ్నీ టవర్స్, ఈఫిల్ టవర్, పెట్రోనాస్ ట్విన్ టవర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది.
కోరల్ రీఫ్‌ను అన్వేషించడానికి ఆస్ట్రేలియా పరిశోధక బృందం ‘సుబాస్టియన్’ అనే రోబోట్‌ను ఉపయోగించింది. ‘ఈ కోరల్ రీఫ్ మొత్తంగా 1.5 కిలోమీటర్ల వెడల్పు, 500 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ రీఫ్ బేస్ అరకిలోమీటరు మేర వ్యాపించి ఉంది. 19వ శతాబ్దం తర్వాత ఈ ప్రాంతంలో ఇంత పొడవైన రీఫ్‌ను కనుగొనడం ఇదే తొలిసారి. దీంతో పాటు మరో ఏడు కోరల్ రీఫ్స్ కూడా కనుగొన్నాం. మనకు చంద్రుడి ఉపరితలం మీద ఉన్నవాటి గురించి చాలా తెలుసు కానీ.. సముద్ర గర్భాల్లో ఏముందో తెలియదు’ అని జేమ్స్ కుక్ యూనివర్సిటీలోని కోరల్ రీఫ్ పరిశోధకుడు టామ్ బ్రిడ్జి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేసిన టామ్.. యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్ చేశారు.
ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా నిలిచిన ఎంపైర్ స్టేట్ భవనం పొడవు 381 మీటర్లు కాగా.. కొత్తగా కనుగొన్న పగడపు దిబ్బ ఎత్తు 500 మీటర్లు అని శాస్త్రవేత్తలు తేల్చారు. గ్రేట్ బ్యారియర్ రీఫ్‌లో ఇప్పటికే ఏడాది పాటు అన్వేషించిన శాస్త్రవేత్తలకు ఈ పొడవైన పగడపు దిబ్బలు కనిపించడం సంతోషాన్నివ్వగా.. మరో నెలరోజుల పాటు సాగర గర్భంలో మరింత అన్వేషణ సాగిస్తామని పరిశోధకులు తెలిపారు.