- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగారకుడిపై నీటి ఆవిరి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్ : భూమ్మీద కాకుండా ఇతర గ్రహాలపై జీవాన్వేషణ విషయమై శాస్త్రవేత్తలు ఏళ్లుగా పరిశోధిస్తున్నారు. ఈ క్రమంలో అంగారక గ్రహంపై నీరు భారీ స్థాయిలో ఆవిరవుతోందని బ్రిటన్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. వారి పరిశోధన వివరాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితం కాగా, ఒకప్పుడు మార్స్‌పై జీవరాశులు ఉన్నాయనేందుకు నీటి ఆవిరే సాక్ష్యమని వారు భావిస్తున్నారు. పురాతన నదులు, కాలువల జాడ ద్వారా ఒకప్పుడు ద్రవ రూపంలో అంగారకుడి మీదుగా నీరు ప్రవహించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే కాలక్రమంలో ఈ గ్రహంపై నీరు అంతర్థానమైందని, మంచుగడ్డ కట్టడం వల్ల అంతర్భాగంలోకి వెళ్లిందని అంచనా వేస్తున్నారు.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా రొస్కొమాస్ (Roscomos) సంయుక్త స్పేస్ మిషన్‌లో భాగంగా ఎక్సోమార్స్ ఆర్బిటర్ (ExoMars Trace Gas Orbiter)ను కుజుడిపైకి పంపారు. ఈ ఆర్బిటార్‌లోని నాడిర్ అండ్ అకల్టేషన్ (Nadir and Occultation) అనే ఇన్‌స్ట్రుమెంట్ అంగారక వాతావరణంలో నీరు ద్రవ రూపంలో లేదని, ఆవిరి అవుతున్నదన్న విషయాన్ని కాంతి ప్రసరణ ద్వారా కనుగొంది. నీరు పలు రూపాల్లో ఆవిరి అవుతున్నదని తెలిపే దృశ్యాలను పంపింది. ఈ పరికరం మార్స్‌పైన లైట్‌ను ప్రసరింపజేసి ఇంకా పలు విషయాలు నిర్ధారించనుంది. వాటర్ ఐసొటోప్స్(పలు రూపాల్లో నీరు మారడం) ఆధారంగా రెడ్ ప్లానెట్‌పై నీరు ఎలా మాయమైంది?
అంగారక గ్రహం నివాసయోగ్యతను ఎలా కోల్పోయింది? అనే విషయాలు కనుక్కోవచ్చు. కాగా, ఇటీవల రెండు దేశాల స్పేస్ క్రాఫ్ట్‌లు అంగారకుడి కక్ష్యకు చేరాయి. బీజింగ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా దక్షిణ చైనా నుంచి జులైలో లాంచ్ అయిన చైనీస్ టియాన్‌వెన్-1(Chinese Tianwen-1) స్పేస్ క్రాఫ్ట్.. రెడ్ ప్లానెట్ కక్ష్యలోకి చేరింది. అరబ్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపిన హోప్(Hope) స్పేస్ క్రాఫ్ట్, సక్సెస్‌ఫుల్‌గా కుజుడి కక్ష్యలోకి చేరగా, ఇది ఆ దేశ తొలి ఇంటర్ ప్లానెటరీ మిషన్‌గా చరిత్రలో నిలిచింది.