వచ్చామా.. చూశామా.. వెళ్లామా! అంతే, అంతకు మించి ఏం లేదు.

by Shyam |   ( Updated:2021-08-28 07:24:27.0  )
liqee
X

దిశ, పరిగి : కరోన వైరస్ ప్రభావంతో మూతబడిన పాఠశాలలు కాస్త మందు బాబులకు అడ్డాగా, పశువుల నిలయాలుగా మారాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలల పున: ప్రారంభం కానున్నాయి. పాఠశాలలను శుభ్రం చేసి పనిలో నిమగ్నమైనా ఉపాధ్యాయులకు తోడుగా పరిగి మున్సిపల్ అధికారులు సిబ్బందితో పని చేయించారు. కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారన్న కనీసం జ్ఞానం లేకుండా మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు వ్యవహరించారు.

కేవలం పాఠశాల ఆవరణలో పైపైనే బ్లీచింగ్ పౌడర్ చల్లి చేతులు దులుపుకున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం బాటిల్, ప్లాస్టిక్ గ్లాసు, వాటర్ ప్యాకెట్ తీసి పారవేయాలన్న చిత్తశుద్ది కూడా లేకుండాపోయింది. తరువాత ఇదే పరిగి హరిజన్ వాడలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ పౌసమి బసు, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవి పర్యవేక్షించారు. వారి చూపు కూడా తమ ఎదురుగా ఉన్న ఖాళీ మద్యం సీసాపై పడక పోవటం గమనార్హం. దంతకు తగ్గ బొంత అన్నట్లు ఉంది, ప్రస్తుత పరిస్థితి.

Advertisement

Next Story

Most Viewed