పేద వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్స్

by Shyam |
పేద వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
X

దిశ, న్యూస్‌బ్యూరో: మెరిట్‌ ఆధారంగా వైద్య కాలేజీలో ప్రవేశానికి అర్హత సాధించినప్పటికీ కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్న కారణంగా వైద్య విద్యను అందుకోలేని పేద విద్యార్థులకు జూలై 2న స్వర్గస్థులైన ప్రముఖ వైద్యులు, హెచ్‌ఈఎస్‌ సొసైటీ వ్యవస్థాపకులు డా.కె.వి.ఆర్‌. ప్రసాద్‌ జ్ఞాపకార్థం ‘డా.కె.వి.ఆర్‌. ప్రసాద్‌ మెమోరీయల్‌ అవార్డ్‌’’ను అందజేయనున్నట్లుగా హెచ్‌ఈఎస్‌ సొసైటీ ప్రకటించింది. వైద్య విద్య అందుకునే నాలుగేళ్ల ఫీజును సొసైటీ పూర్తిగా భరిస్తుంది. ఎన్‌ఈఈటీ యూజీ ద్వారా రాష్ట్రంలోని ఏదేని ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటును మెరిట్‌తో సాధించి, సంవత్సరానికి లక్ష రూపాయలు అంతకంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగిన అర్హులైన అభ్యర్థులు ఇక్కడ తెలిపిన లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. http://hessociety.org/drkvrprasad/

కె.వి.ఆర్‌. ప్రసాద్‌ గురించి..

డా.కె.వి.ఆర్‌. ప్రసాద్‌ నగరంలో సీనియర్‌ ఫిజిషియన్‌గా ప్రముఖ వైద్యులుగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు. సీతాఫల్‌‌మండీలో 5దశాబ్దాల క్రితం శ్రీదేవి నర్సింగ్‌హోమ్‌ స్థాపించి, చివరి శ్వాస వరకు సమాజానికి విశేష సేవలతో తన జీవితాన్ని అంకితం చేశారు. కుటుంబ సభ్యులు, డా.కె.హరిప్రసాద్‌ రచించిన ఐయామ్‌ పాజిబుల్‌ పుస్తకం అమ్మకాల ద్వారా సొసైటీకి ప్రస్తుతం అవసరమైన నిధులను సమకూరుస్తున్నారు.

Advertisement

Next Story