పీజీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ. 6 లక్షల స్కాలర్షిప్

by Harish |   ( Updated:2023-01-06 15:50:01.0  )
పీజీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ. 6 లక్షల స్కాలర్షిప్
X

స్కాలర్షిప్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ప్రతిభావంతులైన 100 మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అందిస్తోంది. విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా తమ చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్ అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత:

గుర్తింపు పొందిన సంస్థలో ఈ కింద తెలిపిన కోర్సు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చదువుతూ ఉండాలి.

కంప్యూటర్ సైన్స్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్

ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

కెమికల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

రినెవబుల్, న్యూ ఎనర్జీ

మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్

లైఫ్ సైన్సెస్

గేట్ పరీక్షలో 500 నుంచి 1000 స్కోరు సాధించి ఉండాలి.

లేదా యూజీలో 7.5 లేదా అంతకన్నా ఎక్కువ సీజీపీఏ స్కోరు ఉండాలి.

భారతదేశ పౌరులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

స్కాలర్షిప్ మొత్తం:

పీజీ ప్రోగ్రాం మొత్తానికి రూ. 6 లక్షల స్కాలర్షిప్ అందిస్తారు.

కావలసిన పత్రాలు:

పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో గ్రాఫ్

అడ్రస్ ప్రూఫ్

కరెంట్ రెజ్యూమ్

10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ మార్క్స్ షీట్.

గేట్ ఎంట్రన్స్ పరీక్ష మార్క్స్ షీట్.

యూజీ మార్క్స్ షీట్

ప్రస్తుత కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా స్టూడెంట్ ఐడీ.

2 ఎస్సేస్: పర్సనల్ స్టేట్‌మెంట్ అండ్ స్టేట్‌మెట్ ఆఫ్ పర్పస్.

2 రిఫరెన్స్ లెట్టర్స్: 1 అకడమిక్, 1 క్యారెక్టర్

ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్/లెట్టర్స్ ఫ్రమ్ వర్క్ ఎక్స్ పీరియన్స్/ఒకవేళ ఉంటే ఇంటర్న్‌షిప్.

చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2023

వెబ్‌సైట్: https://www.scholarships.reliancefoundation.org

Advertisement

Next Story

Most Viewed