- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.2 లక్షల స్కాలర్‌షిప్
దిశ, వెబ్‌డెస్క్: డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త చెప్పింది. 2023-24 డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రూ.2 లక్షలను ప్రోత్సాహకంగా అందిస్తుంది. ఈ అమౌంట్ ద్వారా విద్యార్థులు ట్యూషన్ ఫీజు, ల్యాప్‌టాప్, పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. ప్రతి ఏడాది రిలయన్స్ ఫౌండేషన్ చదవుకునే స్థోమత లేని పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తుంది.
ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయడానికి సంబంధిత వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను నమోదు చేయాలి. ఆ తరువాత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటి వద్ద నుంచి కూడా పరీక్ష రాయవచ్చు. మొదటి ఏడాది యూజీ కోర్సులు చదువుతున్న వారే అప్లై చేయాలి. గరిష్ట వయసు లేదు. అభ్యర్థుల తల్లిదండ్రల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉండాలి. ముఖ్యంగా రూ.2.5 లక్షల లోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు 10+2 లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. మొత్తం 5000 విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందించనున్నారు.
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 15, 2023