ఈ కోర్సు చదివే విద్యార్థులకు రూ. 1 లక్ష స్కాలర్షిప్.. పూర్తి వివరాలు ఇవే

by Disha Web Desk 17 |
ఈ కోర్సు చదివే విద్యార్థులకు రూ. 1 లక్ష స్కాలర్షిప్.. పూర్తి వివరాలు ఇవే
X

స్కాలర్షిప్: నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఫొటోగ్రఫీ సంబంధిత కోర్సులను అభ్యసించడానికి సమాజంలోని వెనుకబడిన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోంది. 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధితో ఫోటోగ్రఫీకి సంబంధించిన కోర్సులో చేరిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తారు.

అర్హతలు:

మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన ఫొటోగ్రఫీ సంబంధిత కోర్సు చదువుతున్న వారై ఉండాలి.

12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించరాదు.

స్కాలర్షిప్ మొత్తం: ఎంపికైన వారికి రూ. 1 లక్ష స్కాలర్షిప్ గా అందిస్తారు.

డాక్యుమెంట్స్:

ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్(ఆధార్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డ్)

అడ్రస్ ప్రూఫ్

ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్ (రిసిప్ట్/అడ్మిషన్ లెటర్/ఐ.డీ/బోనఫైడ్)

12వ తరగతి మార్క్స్ షీట్.

కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఫార్మ్ 16 ఎ/ఇన్ కమ్ సర్టిఫికెట్/శాలరీ స్లిప్)

దరఖాస్తు దారుని బ్యాంకు డీటెయిల్స్ (క్యాన్సల్డ్ చెక్/పాస్ బుక్ కాపీ)

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

చివరి తేదీ: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.buddy4study.com



Next Story