పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు స్కాలర్‌షిప్.. ఏడాదికి ఎంతంటే ?

by Seetharam |   ( Updated:2022-11-17 04:17:39.0  )
పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు స్కాలర్‌షిప్.. ఏడాదికి ఎంతంటే ?
X

దిశ, కెరీర్: డ్రైవర్ పిల్లల చదువులను కొనసాగించే ఉద్దేశంతో మహీంద్రా ఫైనాన్స్.. సాక్షమ్ స్కాలర్షిప్ అందిస్తోంది. పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్న డ్రైవర్ల పిల్లలు విద్యాపరమైన, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తూ మహీంద్రా ఫైనాన్స్ ఈ అవకాశం కల్పిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన అర్హులైన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్నవిద్యార్థులై ఉండాలి.

గత పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.

వ్యాలిడ్‌లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ పిల్లలు అయి ఉండాలి.

వార్షిక కుటుంబ ఆదాయం 4 లక్షలకు మించి ఉండరాదు.

స్కాలర్షిప్ మొత్తం: ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 20000 అందిస్తారు.

ధ్రువపత్రాలు:

గత పరీక్షల మార్క్ షీట్

ఫోటో ఐడెంటిటీ

ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్

అడ్మిషన్ ప్రూఫ్

బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్

కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవర్ కాంట్రాక్ట్ ప్రూఫ్ /ఐడికార్డ్

అడ్రెస్ ప్రూఫ్

ఫొటో గ్రాఫ్

చివరితేది: డిసెంబర్ 31, 2022

వెబ్‌సైట్: https://www.buddy4study.కం

ఇవి కూడా చదవండి : హాస్టల్ అడ్మిషన్స్ సమస్య.. నిజాం కాలేజీ యాజమాన్యం కీలక ఉత్తర్వులు

Advertisement

Next Story

Most Viewed