టీడీపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

by srinivas |
టీడీపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌ జ్యోతుల నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జగ్గంపేటలో రోడ్డు విస్తరణ పనుల్లో జేసీబీ ఆపరేటర్‌ ధనకృష్ణపై చేయి చేసుకుని కులం పేరుతో దుర్భాషలాడినట్లు జ్యోతుల నవీన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.

రోడ్డు విస్తరణలో టీడీపీ కార్యకర్తకు చెందిన షాపు కూలింది. దీంతో ఆగ్రహించిన నవీన్‌.. కాంట్రాక్టర్‌ను పాతేస్తానంటూ దుర్భాషలాడినట్లు తెలిసింది. జగ్గంపేట పోలీసు స్టేషన్‌లో జేసీబీ ఆపరేటర్ ధనకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed