- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జడ్జీ హత్య’పై వారంలోగా నివేదిక ఇవ్వండి’
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించిన ధన్‌బాద్ జడ్జీ హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణలో భాగంగా జడ్జీ హత్యకేసులో దర్యాప్తు స్టేటస్ రిపోర్టును వారంలోగా సమర్పించాలని జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్(డీజీపీ) నీరజ్ సిన్హాను శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా దేశంలో న్యాయ అధికారులపై జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా న్యాయ అధికారులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన నివేదికలు తమకు అందుతున్నాయని, వీటిని పరిశీలించాలనుకుంటున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
కావున అన్ని రాష్ట్రాల నుంచీ నివేదికలు కోరవచ్చునని వెల్లడించారు. అలాగే, ధన్‌బాద్ హత్యకేసులో విస్తృత కుట్ర కోణాలు దాగి ఉన్నాయని, దీనిపై దర్యాప్తును పర్యవేక్షిస్తూ ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ హైకోర్టుకు సూచించింది. కాగా, బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ధన్‌బాద్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జీ ఉత్తమ్ ఆనంద్‌ను ఆటో రిక్షా ఢీకొట్టడంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇద్దరు గ్యాంగ్ స్టర్‌లకు బెయిల్ నిరాకరించడంతో వారే హత్య చేయించారని పోలీసులు వెల్లడించారు.