ఆయన శక్తి సామార్థ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి : ఎన్వీ రమణ

by Shamantha N |   ( Updated:2021-04-23 21:26:23.0  )
ఆయన శక్తి సామార్థ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి : ఎన్వీ రమణ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విస్తృత వ్యాప్తిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేఐ జస్టిస్ బోబ్డే వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఎన్వీ రమణ మాట్లాడుతూ… వీడ్కోలు పలకడం అనేది కష్టమైన పని అన్నారు. సీజేఐ జస్టిస్ బోబ్డేతో కలిసి పనిచేసిన బంధాన్ని మరిచిపోలేనని తెలిపారు. జస్టిస్ బోబ్డే తెలివి, శక్తి సామార్థ్యాలు తనను ఆకట్టుకున్నాయని అన్నారు. ప్రస్తుతం దేశమంతా పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. అందరం కరోనా మహమ్మారితో పోరాడుతున్నామని, క్లిష్టమైన సమయంలో బలమైన చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు. క్రమశిక్షణతోనే మహమ్మారిని ఓడించగలం అన్నారు.

Advertisement

Next Story