సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు నో ‘స్టే’: సుప్రీం

by Shamantha N |
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు నో ‘స్టే’: సుప్రీం
X

న్యూఢిల్లీ: రూ.20,000 కోట్లతో నూతన పార్లమెంటు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ఢిల్లీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు స్టే ఇచ్చేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరాకరించింది. విస్టా ప్రాజెక్టు కింద సెంట్రల్ ఢిల్లీలోని లుటెన్స్ జోన్‌లో నూతన పార్లమెంటు, కార్యాలయాలు నిర్మించనున్నారు. వాటిని నిలిపివేయాలని, ప్రాజెక్టు ద్వారా 86 ఎకరాల భూమి ఆక్రమించబడుతుందనీ, ఇందులో భవనాలు నిర్మించడం ద్వారా పర్యావరణానికి ప్రమాదముందని రాజీవ్ సురి పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌ను గురువారం భారత్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే, అనిరుద్ధబోస్‌లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ‘‘ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇటువంటిదే మరో పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నదనీ, ఈ కొవిడ్ 19 పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేరనీ, విచారణ అత్యవసరమేమి కాదని’’ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే అన్నారు. విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Tags: delhi central vista project, sc bench, chief justice s a bobde, new parliament

Advertisement

Next Story