స్నేహలతను చంపి… మృతదేహాన్ని తగలబెట్టారు !

by srinivas |
స్నేహలతను చంపి… మృతదేహాన్ని తగలబెట్టారు !
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ధర్మవరం రూరల్ మండలం బడన్నపల్లి పొలాల్లో యువతిని దారుణంగా హత్య చేసిన దుండగులు.. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెడుతున్న క్రమంలో స్థానికుల రాకను గమనించి పారిపోయారు. సగం కాలిపోయిన మృతదేహం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. హత్యకు గురైన యువతి ఎస్‌బీఐ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి స్నేహలతగా గుర్తించారు. రెండ్రోజుల క్రితమే యువతి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ప్రతిరోజు ఇంటి నుంచి బ్యాంక్‌కు బైక్‌పై వెళ్లి వస్తుందని పేర్కొన్నారు. యువతి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story