టూ-వీలర్ లవర్స్‌కి ఎస్‌బీఐ గుడ్ న్యూస్!

by Harish |
టూ-వీలర్ లవర్స్‌కి ఎస్‌బీఐ గుడ్ న్యూస్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా టూ-వీలర్ కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంకుకు చెందిన యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా సులభంగా టూ-వీలర్ రుణం పొందడానికి వీలు కల్పిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. ‘ఎస్‌బీఐ ఈజీ రైడ్’ పేరుతో తన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రీ-అప్రూవ్‌డ్ టూ-వీలర్‌లోన్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అర్హత కలిగిన ఎస్‌బీఐ వినియోగదారులు బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లకుండానే తక్కువ సమయంలో రుణాన్ని పొందే అవకాశం ఉంటుందని బ్యాంక్ వివరించింది.

ఎస్‌బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. వినియోగదారులు గరిష్ఠంగా 4 ఏళ్ల కాలవ్యవధితో ఏడాదికి 10.5 శాతం వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు ‘ఈజీ రైడ్’ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస రుణం రూ.20,000గా నిర్ణయించారు. అర్హత ఉన్న వినియోగదారులకు రుణ మంజూరు అయిన వెంటనే నగదు ఖాతాలోకి జమ అవుతుంది. ఈ పథకాన్ని ఉపయోగించిన టూ-వీలర్ ఆన్-రోడ్ ధరలో 85 శాతం వరకు రుణాన్ని పొందే వీలుంటుందని బ్యాంకు వివరించింది. ‘ బ్యాంకు ప్రారంభించిన ‘ఎస్‌బీఐ ఈజీ రైడ్’ పథకం ద్వారా వినియోగదారులు ఇబ్బందుల్లేని, తమకవసరమైన వాహనాన్ని సొంతం చేసుకునేందుకు వీలవుతుందని’ ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed