బ్యాంక్ మేనేజర్ వికృత చేష్టలు.. లోన్ కావాలంటే.. తనతో

by Sumithra |   ( Updated:2021-07-03 03:43:17.0  )
sbi bank manager misbehaving with ladies in nellore district
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్ రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మహిళా ఖాతాదారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల నుంచి లోన్‌లు కట్టలేని, లోన్ కావాల్సిన గృహణిలను టార్గేట్ చేసుకుని, రుణాల కోసం వచ్చే మహిళలను లోబర్చుకుంటున్నాడు కామాంధుడు. రుణాల కోసం వచ్చే మహిళల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కొందరితో బ్యాంక్ ఆవరణంలోనే వికృతచేష్టలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. బ్యాంక్‌కు వెళ్లే వారి ఫోన్ నెంబర్‌లు తీసుకుని వారి వివరాలు అడగడం తర్వాత వారిని లోబరుచుకోవడం చేస్తుంటాడు. ఒంటరిగా మహిళలు మేనేజర్ క్యాబిన్‌లోకి వెళ్లాలంటే జంకుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కామంధుడు బ్యాంక్ మేనేజర్‌గా ఉంటే బ్యాంకులో మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story