- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీకు SBI అకౌంట్ ఉందా.. ‘30 లక్షలు’ మీ సొంతం..
దిశ, వెబ్‌డెస్క్ : ఖాతాదారులకు SBI ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న SBI కస్టమర్ల కోసం ఇప్పటికే పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ప్రతీ బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు చాలా కీలకమైనవి. బ్యాంక్‌లో ఎన్నో రకాల అకౌంట్లు ఉన్నాయి. శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, జీరో అకౌంట్ ఇలా పలు రకాల ఖాతాలు ఉన్న విషయం తెలిసిందే.
అయితే, SBIలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఖాతాదారులకు చాలా రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. SBIలో శాలరీ అకౌంట్ ఉంటే.. రూ.30 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే అపరిమిత ఏటీఎం లావాదేవీలు కూడా జరపవచ్చు. ఉచిత నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సర్వీసులు లభిస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఇలా శాలరీ అకౌంట్ తెరిస్తే చాలా బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి. ఏ కేటగిరిలో లోన్ తీసుకున్నా కూడా 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు లభిస్తుంది. అలాగే 2 నెలల ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందే అవకాశం ఉంటుంది. అంటే మీరు 2 నెలల వేతనాన్ని ముందుగానే పొందవచ్చు. అంతేకాకుండా లాకర్ ఛార్జీల్లో కూడా.. 25 శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఇంకా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా SBI ఫ్రీగా అందిస్తోంది.