- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ భూములను కాపాడాలని అఖిలపక్షం ధర్నా
దిశ, బెల్లంపల్లి: పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను కాపాడాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. అనంతరం నాయకులు మున్సిపల్ కమిషనర్ జంపాల రజితకు వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ ,బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని టాక్రియానగర్‌లో ప్రభుత్వ భూములు అమ్మకాలు, కొనటాలు నేరం అనే బోర్డులు అధికారులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉన్న టాక్రియా నగర్‌లో అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్న అంశాన్ని లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ సాన శ్రవణ్ పేరుతో జనవరి 14 న 6 గుంటల స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టారన్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికి అమలు కాకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తూ కోట్లు గడిస్తున్న కబ్జా దారులకు అధికారులు వంతపాడుతున్నారన్నారు.
ప్రభుత్వ భూములు కాపాడాలని హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపల్‌లో ప్రజలకు త్రాగునీటి సరఫరా చేయటంలో అధికారులు విఫలం అయ్యారని, పక్కనే గోదావరి పారుతున్న గుక్కెడు నీళ్ళు కూడ ఇవ్వలేని స్థితిలో అధికార పార్టీ ఉందని విమర్శించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు సూరిబాబు, చిప్పనరసయ్య, సంజయ్, కాశీ సతీష్ కుమార్, గెల్లీ జయరాం యాదవ్, బత్తుల మధు, గోగర్ల శంకర్, అమానుల్లాఖాన్, మని రాము సింగ్, మహమ్మద్ గౌస్, బండి రాము, ధరణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.