- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెంచిన ధరలను తగ్గించకపోతే రాష్ట్రంలో ఆందోళనలు తప్పవు..
X
దిశ, కూకట్పల్లి: పెరిగిన గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. చేవెళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. అనంతరం సత్యం శ్రీరంగం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో ధరల నియంత్రణ చేయలేకపోయాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని అన్నారు.
Advertisement
Next Story