ప్రజలు మోసపోతున్నారు.. స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమాలపై ఫైర్ అయిన సత్యదేవ్.. 

by Shyam |   ( Updated:2023-10-12 07:28:58.0  )
satya dev
X

దిశ, సినిమా: హీరో సత్యదేవ్ మరో హిట్ అందుకోబోతున్నట్లు కనిపిస్తుంది. తన తాజా చిత్రం ‘గాడ్సే’ టీజర్లోని పవర్ ఫుల్ డైలాగ్‌లు జనాన్ని ఆకట్టుకుంటుండగా.. మరో హిట్ తన ఖాతాలో పడినట్లే అంటున్నారు. ప్రజలకు సేవ చేస్తే కోట్లు ఎలా వస్తున్నాయి? అని ప్రశ్నిస్తూ.. తెరకెక్కిన ఈ సినిమా పబ్లిక్ మనీ లూటింగ్ ఎలా జరుగుతుందో చెప్తోంది. నాగబాబు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన మూవీలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కీలకపాత్రలో కనిపించగా.. సత్యదేవ్ న్యూ అవతార్‌తో ఆకట్టుకోనున్నాడు. ‘ఏ నినాదం వెనుక ఎవ‌రి ప్రయోజ‌నాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజ‌లు మోస‌పోతూనే ఉంటారు’, ‘సాధార‌ణంగా ఉద్యోగం చేస్తే డ‌బ్బులొస్తాయ్‌. వ్యాపారం చేస్తే డ‌బ్బులొస్తాయ్‌. వ్యవ‌సాయం చేస్తే డ‌బ్బులొస్తాయ్‌. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వంద‌ల, వేల, ల‌క్షల కోట్లు ఎలా వ‌స్తున్నాయి రా..? బికాజ్ యు ఆర్ లూటింగ్ ప‌బ్లిక్ మ‌నీ. ఇన్ ది నేమ్ ఆఫ్ స‌ర్వీస్’ లాంటి డైలాగ్స్ జనాన్ని ఆలోచింపజేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed