- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శనివారం పంచాంగం, రాశిఫలాలు (29-05-2021)
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : తదియ
(నిన్న ఉదయం 9 గం॥ 39 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 34 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాడ
(నిన్న రాత్రి 8 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 9 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : ( తెల్లవారు జాము 4 గం॥ 55 ని॥ నుంచి ఉదయం 6 గం॥ 23 ని॥ వరకు)
అమ్రుత ఘడియలు : ( మధ్యాహ్నం 1 గం॥ 44 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 12 ని॥ వరకు)
దుర్ముహూర్తం : ( ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి 8 గం॥ 17 ని॥ వరకు)
రాహుకాలం : ( ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి 10 గం॥ 34 ని॥ వరకు)
గుళికకాలం : ( తెల్లవారు జాము 5 గం॥ 41 ని॥ నుంచి 7 గం॥ 19 ని॥ వరకు)
యమగండం : ( మధ్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 28 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 45 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : ధనుస్సు
విశేషం : సంకష్ట హరచతుర్థి
మేష రాశి : ఈ కరోనా సమయంలో అనవసర భయాందోళనలను వదిలివేయండి. మీ భయము అనారోగ్యానికి దారి తీయవచ్చు. మానవసేవే మాధవసేవ. దాన ధర్మాలు సహాయము చేయండి. ఇంటిలో పెద్దల సలహా తీసుకోండి. ఆఫీసులో చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి. స్థిరాస్థి వ్యవహారాలను వాయిదా వేయండి. వ్యాపారంలో లాభాలు. ఈ రాశి స్త్రీలు ఫిట్ నెస్ కాపాడుకోవటానికి సరైన ప్రణాళిక వేయండి.
వృషభ రాశి : ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. ఆఫీసులో అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయండి లేకుంటే పై అధికారుల నుంచి మాటలు. ఈరోజు ఏవైనా ముఖ్యమైన పనులను ఆలోచించి చేయండి లేకుంటే వాయిదా వేయండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కాలం వృధా చేయవద్దు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి మీ కొరకు చాలా ఖర్చు పెడతారు ఆనందించండి.
కర్కాటక రాశి : బయటి భోజనం కన్నా ఇంటి భోజనము ఆరోగ్య కరము. జీతము పెంచమనే మీ కోరిక ఎటు తేలదు. కొత్త assignments విషయంలో జాగ్రత్త వహించండి. భవిష్యత్తులో డబ్బు అవసరాల కోసం ఈ రోజు నుంచే వీలైనంత పొదుపు చేయండి. కుటుంబ సభ్యులతో సహనంతో వ్యవహరించండి మర్యాదపూర్వకంగా మాట్లాడండి. సామాజిక కార్యక్రమాలలో ఇతరులకు చేసిన సహాయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు పాత కష్టమైన విషయాలను మరిచిపోయేలా చేస్తుంది.
మిధున రాశి : మీ కోరికలను తీర్చుకోవడానికి మొండి వాదన చేస్తారు. ఈ విషయము కుటుంబ సభ్యుల మధ్య చర్చకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంది. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదన కొరకు సరైన చోట పెట్టుబడులు పెట్టండి. ఆఫీసును మీ పని సామర్థ్యాన్ని అందరూ పొగుడుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలకు అతి విశ్రాంతి తగదు యాక్టివ్‌గా ఉండండి.
సింహరాశి : ఫిట్ నెస్ కొరకు యోగ మెడిటేషన్ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపార విషయాలలో మీ తండ్రిగారి సలహాలు పాటించండి. మీ మనసును బాధ పెట్టిన వారితో వాదోపవాదాలకు దిగకండి. ఈ సమస్య మరింత పెద్దదవుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపటం వలన కుటుంబ బంధం గట్టిపడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ విషయాలలో బంధువుల ప్రమేయం ను నివారించండి
కన్యారాశి : అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు దైవసహాయం మీకుంది. అత్యాశతో డబ్బు లాభం కోసం దొంగ స్కీముల జోలికి పోకండి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యంగా ఉండకండి. తెలియని వారితో వాదోపవాదాలు దిగకండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి మంచి అద్భుతమైన కానుకను తీసుకోవడానికి రెడీగా ఉండండి.
వృశ్చిక రాశి : విద్యార్థులకు వారి శక్తిసామర్థ్యాల మేరకు విజయఅవకాశాలు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించండి. ఇంటిలో పెద్దవారికి అనారోగ్య సూచనలు. జాగ్రత్తగా ఉండండి. ఫిట్ నెస్ కొరకు నిజాయితీగా పాటుపడండి. ఆరోగ్యం పూర్తిగా అదుపులో ఉంటుంది. ఆఫీసులో పనులన్నీ సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి వాదోపవాదాలకు పోవద్దు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామికి మీ విలువ తెలుస్తుంది.
తులారాశి : మీ డబ్బు పెట్టుబడుల విషయాలు పొదుపు విషయాలు పదిమందికి చెప్పకండి. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్త పడకపోతే అనారోగ్య సూచనలు. ఈ ఆనందకరమైన రోజు లో అనవసరమైన ఆందోళనను వదిలివేయండి. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు మనసు లగ్నం చేసి చదవండి విజయం మీదే. ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.
ధనుస్సు రాశి : ఈరోజు ముఖ్యమైన పనులు చేయబోయే ముందు పెద్ద వారి ఆశీర్వచనాలు తీసుకోండి. పాత స్నేహితులతో చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందం ఇస్తాయి. రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి అమ్మకాలలో కావలసిన రేటు లభించదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వీ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.
మకర రాశి : ఆర్థిక విషయాలలో చేతికి కావాల్సినంత ధనం అందుతుంది. దుబార, వృధా ఖర్చులను నియంత్రించండి. అలాగే అతి తిండి కూడా మీ శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడదని గ్రహించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. వ్యాపారంలో భాగస్వాములకు మీ నిర్ణయమును గట్టిగా చెప్పండి. ఈ రాశి స్త్రీలకు మీ ఆత్మీయులతో సమస్యలను విప్పి చెప్పండి పరిష్కారం పొందండి.
కుంభరాశి : మీకు అప్పగించబడిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బిల్డర్స్ మరియు కాంట్రాక్టర్లకు అనుకోని మంచి అవకాశాలు. ఆరోగ్యం కోసం మంచి చిట్కాలను పాటించండి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడటానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. మీ నెగటివ్ ధోరణి మీ వారిని నిరుత్సాహ పరుస్తుంది. మీరు మారాలి తప్పదు. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలు గాడి తప్పకుండా సరైన నిర్ణయాలు తీసుకోండి.
మీన రాశి : నిరాశవాద ధోరణిని పూర్తిగా పక్కకి నెట్టేయండి. ఆ రోజులు అయిపోయినాయి. సామాజిక కార్యక్రమాలలో మీకు ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు వారి ఊహలకు తగిన ఉద్యోగం కొరకు అధిక శ్రమ పడవలసి వస్తుంది. ఆర్థిక పరమైన విషయాలు పూర్తిగా మెరుగుపడతాయి. బయట భోజనం కన్నా ఇంటిలోని భోజనం మిన్న మరియు ఆరోగ్యకరం ఈ రాశి స్త్రీలు కుటుంబం ఆనందం కొరకు కావలసిన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.