- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శనివారం పంచాంగం, రాశిఫలాలు (24-04-2021)
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : ద్వాదశి సా4.01
తదుపరి త్రయోదశి
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : ఉత్తర/ఉత్తర ఫల్గుణి రా1.58
తదుపరి హస్త
యోగం : ధృవం ఉ8.50
తదుపరి వ్యాఘాతం
కరణం : బాలువ సా4.01
తదుపరి కౌలువ తె3.07
ఆ తదుపరి తైతుల
వర్జ్యం : ఉ9.46 – 11.18
దుర్ముహూర్తం : ఉ5.42 – 7.22
అమృతకాలం : రా7.01 – 8.33
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం : మ1.30 – 3.00
సూర్యరాశి : మేషం || చంద్రరాశి: సింహం
సూర్యోదయం : 5.42 || సూర్యాస్తమయం: 6.13
మేషం : చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది.దూరపు బంధువులు నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆప్తులతో శుభకార్యా విషయాల గూర్చిచర్చిస్తారు.వృత్తి,ఉద్యోగ విషయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది.వ్యాపారాలలో లాభాలు అందుతాయి.
వృషభం : ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. బంధు మిత్రుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి . నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు.
మిధునం : కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి.దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.సంతానం విద్యా విషయాలలో అసంతృప్తి కలిగిస్తాయి.వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
కర్కాటకం : వ్యాపారవ్యవహారాలలోఅంచనాలు నిజమవుతాయి ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.సంఘంలోగౌరవమర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వృత్తి ,ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి.
సింహం : కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.అనవసర వ్యవహారాలలో ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.వృత్తి ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.
కన్య : ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారాలలో నూతన అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రముఖులసలహాలుతీసుకోవడం మంచిది.వృత్తి , ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
తుల : చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసిరావు.వృత్తి,ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యులతో స్ధిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది
వృశ్చికం : నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు పాత మిత్రులను కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున మరింత ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
ధనస్సు : కుటుంబ సభ్యులు నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో కీలక విషయాల గూర్చి చెర్చిస్తారు.పాత మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగయోగమున్నది.
మకరం : కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు.ఇంటాబయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.కొత్త వ్యాపారాలునిరుత్సహపరుస్తాయి ఉద్యోగాలలో పనిభారం అధికమౌతుంది.
కుంభం : చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి నూతనఋణప్రయత్నాలుచేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు చికాకు కలిగిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.
మీనం : నిరుద్యోగులకుశుభవార్తలుఅందుతాయి.ధనవిషయంలో అనుకూలత కలుగుతుంది.అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆలయాల సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు. చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో అనుకూలిస్తాయి.ఆర్ధిక పురోగతి కలుగుతుంది.