- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా ముగించినందుకు.. తహసీల్దార్‌ను నిలదీసిన సర్పంచ్‌లు
దిశ, వెల్గటూర్: మండల పరిధిలో విధులు నిర్వహించే వీఆర్ఏలు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రావడం లేదని ఆయా గ్రామాల సర్పంచ్‌లు వెల్గటూర్ తహసీల్దార్ రాజేందర్‌ను నిలదీశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూలమల్ల లక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని అధికారులు కేవలం 45 నిమిషాల్లోనే ముగించారు.
దీంతో పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో గల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే సభను ఎందుకు ముగించారని నిలదీశారు. కులం, నివాసం, ఆదాయాలకు సంబంధించిన ధృవ పత్రాల మంజూరు కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇంతకీ వీఆర్ఏలు ఉన్నట్టా.. లేనట్టా అంటూ ఫైర్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తహసీల్దార్ రాజేందర్ వివరణ ఇస్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీఆర్ఏలపై చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
- Tags
- Jagtial