ఆ సమావేశానికి హాజరు కానీ సర్పంచ్‌లు.. షాక్‌లో ఎంపీపీ

by Shyam |
ఆ సమావేశానికి హాజరు కానీ సర్పంచ్‌లు.. షాక్‌లో ఎంపీపీ
X

దిశ, మద్దూరు : సర్పంచ్‌లు లేక సర్వసభ్య సమావేశం వెలవెలబోయింది. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీపీ విజయలక్ష్మి గారి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో జిల్లా‌లోనే అతి పెద్ద మండలమైన మద్దూరులో 49 పంచాయతీలు ఉండగా 19 మంది ఎంపీటీసీ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశములో పలు అంశాలపై శాఖలవారీగా సమాచారం తెలియ జేశారు. కాగా, ఈ సమావేశానికి పలువురు సర్పంచ్‌లు హాజరుకాకపోవడం గమనర్హం.

Advertisement

Next Story