- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డుల ‘సర్పంచ్’.. అందుకే 90 ఏళ్ల వయసులో మరో అవార్డు..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 42 సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేసి రికార్డు సృష్టించిన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వీరస్వామికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు జీవన సాఫల్య పురస్కారం లభించింది. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 1954 నుండి 2001 సంవత్సరం వరకు వరుసగా 42 సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేసి రికార్డు సృష్టించారు. ఆరు సార్లు ఏకగ్రీవ గ్రీవంగా సర్పంచ్ గా ఎంపిక కాగా మూడు సార్లు ఇతరుల పై పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే 42 సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేసిన ఘనత వీరస్వామి కి దక్కింది అనడంలో అతిశయోక్తి లేదు. వయోభారం, రిజర్వేషన్ల కారణంగా 2001వ సంవత్సరం నుండి పోటీకి దూరంగా ఉండి తన తన మద్దతుదారులను పోటీకి నిలిపి గెలిపించడం లో ప్రధాన పాత్రలు పోషించారు.
అభివృద్ధి ప్రదాత
గ్రామ సర్పంచిగా బాధ్యతలు నిర్వహిస్తూ తమ గ్రామం తోపాటు, బూత్పూర్ మండల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మండలంలో మొట్టమొదట విద్యుత్తు ఏర్పాటైన గ్రామం గాను, టెలివిజన్ ను ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ గాను అమిస్తాపూర్ గ్రామం నిలవడం లో వీరస్వామి ప్రధాన పాత్రను పోషించారు. భూత్పూర్- అమిస్తాపూర్ గ్రామాల మధ్య ప్రభుత్వ పాఠశాల, మండల కార్యాలయ కాంప్లెక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అమిస్తాపూర్ లో పాఠశాలల ఏర్పాటు తదితర అంశాలలో వీరస్వామి ప్రధాన భూమికను పోషించారు. ఆయన మొదటి నుండి కాంగ్రెస్ వాది అయినప్పటికిని అధికార పార్టీ నేతలను పంపించి, మెప్పించి భూత్పూర్, అమిస్తాపూర్ గ్రామాల అభివృద్ధిలో ప్రధాన భూమికను పోషించారు.
పలువురు ముఖ్యమంత్రులను, మంత్రులను గ్రామానికి ఆహ్వానించారు. ఇలా అభివృద్ధికి అంకితమైన వీరస్వామికి ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఉండడం, ఆయన చేసిన సేవలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించి హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గురువారం జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. వీరస్వామి కి ఇన్నాళ్లకు గుర్తింపు దక్కడం పట్ల అమిస్తాపూర్ గ్రామస్థులతో పాటు, భూత్పూర్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.