- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచ్ ఆత్మహత్య.. కారణం అదేనా.. ?
దిశ, జడ్చర్ల : పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జడ్చర్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్ తండాకు చెందిన సర్పంచ్ సిరి (30) గత మూడు రోజుల క్రితం కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మొదట జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు సర్పంచ్ సిరి ఆమె భర్త శ్రీనులది ప్రేమ వివాహం, వీరికి ఇద్దరు కుమారులున్నారు. గ్రామంలో గ్రామ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రథమ పౌరురాలు ఆత్మహత్య చేసుకోవడంతో తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా సర్పంచ్ ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబ కలహాలేనా, లేక ఇంకేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.