‘సర్కార్ వారి పాట’ ఆగిపోయిందా?

by Shyam |
‘సర్కార్ వారి పాట’ ఆగిపోయిందా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కార్ వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, జీఎంబీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అమెరికాలో స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ చేయగా.. మెయిన్ కాస్ట్‌పై చిత్రీకరణ జరగాల్సి ఉంది.

అయితే, అమెరికా వెళ్లే యూనిట్ సభ్యులు వీసాల కోసం అప్లయ్ చేయగా.. ప్రాసెస్ కాలేదని తెలుస్తోంది. ఈ కారణంగా రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వీసా అప్రూవ్ అయితే మాత్రం జనవరి వరకు రెగ్యులర్ షూటింగ్ జరగొచ్చు. ఈ నేపథ్యంలో మహేశ్ త్రివిక్రమ్ వైపు చూస్తున్నట్టుగా న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘సర్కార్ వారి పాట’ సినిమాను నిలిపివేసి, గురూజీతో సినిమాను పట్టాలెక్కించే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్.

Advertisement

Next Story