ప్రిన్స్‌కు సూపర్ గిఫ్ట్..

by Anukaran |   ( Updated:2023-10-10 16:48:36.0  )
ప్రిన్స్‌కు సూపర్ గిఫ్ట్..
X

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఓ కంప్లీట్ యాక్టర్ అన్న విషయం తెలిసిందే. ‘మురారిగా అల్లరి చేసినా, ఒక్కడులో అజయ్ వర్మగా ప్రేమికురాలి కోసం నిలబడినా, నిజంలో జి.సీతారామ్‌గా అమ్మ కోసం పగతీర్చుకున్నా, అతడులో నందుగా ఆప్యాయత, అనురాగం కోసం ఆరాటపడినా, పోకిరి సినిమాలో కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా, పండుగాడి‌గా తన యాక్టింగ్‌తో మైండ్ బ్లాక్ చేసినా, ప్రాణాలు కాపాడే ప్రతీ ఒక్కడు దేవుడే అన్న కాన్సెప్ట్‌తో ఖలేజాలో కూల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా, దూకుడులో బల్లారి బాబుగా నవ్వులు పంచినా, భరత్ అను నేనులో సీఎం భరత్ రామ్‌గా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా’ కేవలం మహేశ్‌కే సొంతం. శ్రీమంతుడు సినిమా తర్వాత అదే కాన్సెప్ట్ నిజజీవితంలోనూ కంటిన్యూ చేస్తూ సొంత గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పించినా అది మహేశ్‌కే సాధ్యం. తన ప్రతీ సినిమాతో సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేందుకు ట్రై చేస్తున్న మహేశ్.. కష్ట కాలంలో ప్రజల సంరక్షణకు విరాళాలు ఇచ్చేందుకు వెనుకాడని మహర్షిగానూ ప్రశంసలు పొందాడు.

నమ్రత స్పెషల్ విషెస్..

కాగా ఈ రోజు(ఆగస్ట్ 9న) సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు స్పెషల్ విషెస్ అందిస్తుండగా.. ప్రిన్స్ లైఫ్ పార్టనర్ నమ్రత శిరోద్కర్ మరింత స్పెషల్‌గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన ప్రేమ అంటే ఏంటో నీవల్లే తెలిసిందన్న నమ్రత.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ మహేశ్‌కు లవ్ యూ చెప్పింది నమ్రత.

సర్కారు వారి పాట కానుక..

అంతేకాదు మహేశ్ పుట్టినరోజు కానుకగా ‘సర్కార్ వారి పాట’ మూవీ యూనిట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రిన్స్ బర్త్ డే‌ను పురస్కరించుకుని మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఒక్క రూపాయితో మహేశ్ సర్కార్ వారి పాట ఎలా దక్కించుకుంటాడో తెలుస్తుండగా.. థమన్ మ్యూజిక్ అదిరిపోయింది. మహేశ్ పుట్టినరోజు కానుకకు ఫిదా అయిన అభిమానులు ప్రిన్స్ యాక్టింగ్, పరశురామ్ కూల్ టేకింగ్, థమన్ సంగీతం కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమని అంటున్నారు. కాగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisement

Next Story