అమిత్ షాతో పవార్ భేటీ

by Shamantha N |
అమిత్ షాతో పవార్ భేటీ
X

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పవార్ వెంట నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ దండేగావ్‌కర్, ఈ ఫెడరేషన్ ప్రతినిధి ప్రకాశ్ నైక్‌నవ్రే ఉన్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా చెక్కెర పరిశ్రమల్లో సహకార సంఘాలు, మహారాష్ట్రలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ వ్యవస్థపై ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా చెక్కెర అమ్మకం ధరలను పెంచాలని, ఇథనాల్ మిశ్రమాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అమిత్ షాను పవార్ కోరినట్టు తెలుస్తోంది.

సమావేశం అనంతరం మీడియాతో శరద్ పవార్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం చెక్కెర విక్రమ ధరలు వాటి ఉత్పత్తి ధరల కన్నా తక్కువ ఉన్నాయి. అందువల్ల దీనిపై కేంద్రం పరిశీలనలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరాను. మెరుగైన స‌హాయ చ‌ర్య‌లను అందించేందుకు వీలుగా కొంక‌ణ్ ప్రాంతంలో నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరాను’అని తెలిపారు. గత కొంత కాలంగా మహావికాస్ అఘాడీలో చీలికలు వస్తున్నట్టు వార్తలు గుప్పు మంటున్నాయి. ఇలాంటి తరుణంలో పవార్ గత వారం ప్రధాని మోడీతో సమావేశం కావడంతో వార్తలు మరింత ఊపందుకున్నాయి. తాజాగా రోజుల వ్యవధిలోనే హోం మంత్రితో భేటి కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య రాజకీయ పరమైన అంశాలపై కీలక చర్చలు జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed