- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గైడ్ అవతారమెత్తిన సారా అలీఖాన్
సారా అలీఖాన్.. సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన క్యూట్ హీరోయిన్. కెరియర్ ప్రారంభంలోనే వరుస హిట్లు ఖాతాలో వేసుకున్న ఈ ప్రెట్టీ గాళ్.. నటిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఈ క్రమంలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సారా.. తన పెర్ఫార్మెన్స్‌తో ఈ జనరేషన్ బెస్ట్ హీరోయిన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత లాక్‌డౌన్ టైమ్‌లో తల్లి, సోదరుడితో ఎంజాయ్ చేస్తున్న సారా.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.
ఇంట్లోనే ఉంటూ బయటి ప్రపంచాన్ని మిస్ అవుతున్న తన ఫ్యాన్స్ కోసం సారా అలీఖాన్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ ఎడిషన్ పేరుతో సారా పోస్ట్ చేసిన తొలి వీడియోలో.. భారత్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎపిసోడ్ 1ను ఎంజాయ్ చేయాలంటూ తను గైడ్‌గా మారిపోయింది. విభిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంలోని చాలా ప్రాంతాలను సందర్శించిన సారా.. ప్రతీ ప్రాంతంలోని గొప్పతనాన్ని, ప్రత్యేకతను తన కెమెరాలో బంధించి ఈ వీడియో రూపంలో ప్రేక్షకులకు అందించింది. తెలంగాణలోని హైదరాబాద్, చార్మినార్ షాపింగ్, ఏపీలోని ఆధ్యాత్మిక ప్రాంతం తిరుపతి కూడా సారా ప్రయాణంలో ఉండటం విశేషం.
ప్రతి రాష్ట్రంలోని సంస్కృతి, నమ్మకం, వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ వీడియో.. నెటిజన్లను ఆకట్టుకోవడంతోపాటు తన ప్రయాణంలో భాగమయ్యేలా చేసింది. తన అనుభవాలను మన ముందుంచి ఎంతోకొంత నేర్చుకునేలా చేసిన సారాకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతూ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు.