- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ నన్ను క్షమించండి.. ఫొటోగ్రాఫర్లను వేడుకున్న నటి
దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీ సారా అలీఖాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా తన అప్ కమింగ్ మూవీ ‘అత్రంగి రే’ నుంచి ‘చకా చక్’ పాట లాంచింగ్ ప్రోగ్రామ్‌ను ముంబైలోని మిథిబాయి కాలేజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు గెస్ట్‌గా వెళ్లిన సారా.. అక్కడ ఓ ఫొటోగ్రాఫర్‌కు జరిగిన సంఘటనపై స్పందించి వార్తల్లో నిలిచింది. విషయానికొస్తే.. ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత కారు ఎక్కే సమయంలో ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. సెక్యూరిటీ గార్డ్స్ వాళ్లను పక్కకునెట్టే క్రమంలో ఒక వ్యక్తి కింద పడ్డాడు.
దీంతో ఒక్కసారిగా షాకైన సారా.. ఎందుకలా చేశారని తన బాడీగార్డ్స్‌ను ప్రశ్నించింది. అయితే ఎవరూ కిందపడలేదు మేడమ్! అని గార్డ్స్ బదులిస్తే.. ‘లేదు లేదు.. మీరు తోసేసిన వ్యక్తి వెళ్లిపోయాడు, నేను చూశాను. ఇంకెప్పుడు అలా చేయడానికి వీళ్లేదు’ అని గట్టిగా చెప్పింది. కాగా ఈ ఇన్సిడెంట్ పట్ల మిగతా ఫొటోగ్రాఫర్స్‌కు సారీ చెప్పడంతో పాటు అందరికీ థాంక్యూ అంటూ మంచి మనసు చాటుకుంది. ఇక తాజాగా రిలీజైన ‘చకా చక్’ పాటతో సారా అందరినీ ఆకట్టుకుంది.
మరక్కార్’ నుంచి మహానటి నయా లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా