మింగిల్ అయ్యేందుకు సిద్ధమే!.. ఆఫర్ ఇచ్చిన హీరోయిన్

by Shyam |
Sanya Malhotra
X

దిశ, సినిమా : ‘దంగల్’ గర్ల్ సన్యా మల్హోత్రా చాలా తక్కువ టైమ్‌లో ఎక్కువ ఫేమ్ సంపాదించింది. ఇప్పటి వరకు చేసిన సినిమా జర్నీ పీరియడ్ తక్కువే అయినా.. షార్ట్ టైమ్‌లోనే డిఫరెంట్ క్యారెక్టర్స్‌ ఎంచుకుని శభాష్ అనిపించుకుంది. అందరినీ విమర్శించే కంగనా రనౌత్‌ సైతం సన్య యాక్టింగ్‌, క్యారెక్టర్స్ ఎంపికపై ప్రశంసల వర్షం కురిపించిందంటేనే సన్య టాలెంట్ గురించి అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సన్య.. ఓ ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది. లైఫ్ పార్ట్‌నర్ గురించి ప్రశ్నించగా.. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది. ఇందుకు కారణమేంటో తనకు కూడా అర్థం కావడం లేదని చెప్పింది. ఈ విషయం గురించి ఫ్రెండ్స్‌ను అడుగుతూనే ఉన్నానని, ముందు తనను ఓపెన్ అవమని సజెస్ట్ చేస్తున్నారని వెల్లడించింది. అయితే తనకు కాబోయేవాడి మానసిక ఆరోగ్యం బాగుండాలని, ఆధ్యాత్మికత కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంది. వీటితో పాటు మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే చాలంటున్న భామ.. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్తోంది. అలాంటి అబ్బాయి కనిపిస్తే ఇన్‌ఫర్మ్ చేయొచ్చుగా అంటోంది సన్య.

Advertisement

Next Story