స్వీట్‌హార్ట్.. నా వెయిట్ గురించి నీకెందుకు?

by Jakkula Samataha |   ( Updated:2021-06-11 03:38:30.0  )
sanusha heroine1
X

దిశ, సినిమా : చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్‌గా రాణిస్తున్న యాక్ట్రెస్ సనుషా సంతోష్.. కొద్ది నెలల క్రితం డిప్రెషన్‌తో బాధపడినట్లు తెలిపింది. యాంగ్జైటీ, పానిక్ అటాక్స్‌తో డిస్టర్బ్ అయిన తను ఎక్స్‌ట్రా వెయిట్ గెయిన్ అయినట్లు వివరించింది. ఆ తర్వాత బరువు తగ్గినా సరే, బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కోవడంతో ఈ కామెంట్స్‌కు చెక్ పెట్టాలనుకున్న సనుష.. సోషల్ మీడియాలో ట్రోలర్స్ చెంపపగిలేలా పోస్ట్ పెట్టింది.

https://www.instagram.com/p/CP5F-f5JlIr/?utm_source=ig_web_copy_link

ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ లుక్ షేర్ చేసిన సనుష.. ‘ఓహ్ ఎస్! నా వెయిట్ గురించి మెన్షన్ చేస్తూ వర్రీ అవుతున్న ప్రతీ ఒక్కరు నా కంటే ఎక్కువగా, టూ మచ్‌గా బాధపడుతున్నారు. స్వీట్‌హార్ట్.. నాకులేని బాధ మీకెందుకు? బరువు తగ్గేందుకు, అందంగా ఉండేందుకు మాత్రమే మనం ఇక్కడ లేము. బాడీ షేమింగ్ గురించి ఇతరులను టార్గెట్ చేసే సమయంలో.. రెండు వేళ్లు ఓ వ్యక్తి వైపు చూపిస్తే, మరో మూడువేళ్లు మీ వైపు చూపిస్తాయని గుర్తుంచుకోండి. మీరు కూడా పర్‌ఫెక్ట్‌గా లేరని నిర్ధారించుకోండి. శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’ అని సూచించింది. కాగా సనుష తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘బంగారం’లో కనిపించి మెప్పించగా.. ఆ తర్వాత ‘జీనియస్‌’లో హీరోయిన్‌గా లీడ్ రోల్ ప్లే చేసింది. చాలా గ్యాప్ తర్వాత నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీలో రచయిత పాత్ర పోషించింది. అంతేకాదు పలు తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటించిన సనుష.. అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది.

Advertisement

Next Story