ఏపీలో క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే..!

by srinivas |
apgovt
X

దిశ, ఏపీ బ్యూరో : క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు సెలవు దినాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపరిచింది. క్రిస్మస్‌ సెలవులు డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని క్యాలెండర్‌లో పేర్కొంది.

డిసెంబర్‌ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ స్పష్టం చేసింది. క్రైస్తవ మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 17 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు సెలవుగానే విద్యాశాఖ ప్రకటించింది.

Next Story