సంజయ్ దత్ కు 3వ దశ క్యాన్సర్?

by Anukaran |   ( Updated:2020-08-11 12:14:56.0  )
సంజయ్ దత్ కు 3వ దశ క్యాన్సర్?
X

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మూడవ దశ లంగ్స్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు పలు నేషనల్ మీడియా సంస్థల్లో ప్రచారం సాగుతోంది. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికాకు ఉన్నపళంగా పయనమైనట్టు సమాచారం అందుతోంది. కాగా శనివారం శ్వాసకోస సమస్యతో ఇబ్బందితో బాధపడుతున్న ఆయన కరోనా అనుమానంతో ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

కరోనా పరీక్షల అనంతరం ఫలితాలు నెగటివ్ రావడంతో వైద్యులు ఆయనను ఐసీయూ వార్డు నుండి ఆదివారం నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. కాగా ఆ సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు లంగ్ కాన్సర్ ఉన్నట్టు తేలిందని తెలుస్తోంది. కాగా ఈరోజు సాయంత్రం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కొంతకాలం పనికి దూరంగా ఉండనున్నట్టు తెలిపారు. అనవసరమైన అపోహలకు భయపడవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. నేను, నా కుటుంబసభ్యుల సహకారంతో క్షేమంగా ఉంటానన్నారు.

Advertisement

Next Story