RCB బిగ్ అనౌన్స్‌మెంట్.. కొత్త కోచ్ అతనే అంటూ అధికారిక ప్రకటన..

by Anukaran |   ( Updated:2021-11-09 09:12:04.0  )
RCB బిగ్ అనౌన్స్‌మెంట్.. కొత్త కోచ్ అతనే అంటూ అధికారిక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో కోహ్లీ అనగానే గుర్తుకు వచ్చే టీం ఆర్‌సీబీ(royal challengers Bangalore). అయితే 2021 ఐపీఎల్ తర్వాత తాను ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు మరింత ఆవేదనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జట్టును మరింత బలంగా తయారు చేసేందుకు సిద్ధమైంది జట్టు యాజమాన్యం. దీంతో వచ్చే సీజన్‌కు ముందు మెగావేలం జరగనున్న క్రమంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్​సంజయ్ బంగర్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని మంగళవారం టీం యాజమాన్యం అధికారికంగా ప్రకటించారు. బంగర్.. ఆర్‌సీబీకి వచ్చే రెండు సీజన్లకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మైక్ హెసన్ జట్టు క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. ఇక, ఐపీఎల్-2022 వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. అంతకుముందు జనవరిలో మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో పాల్గొననున్నాయి.

Advertisement

Next Story