పారిశుధ్య కార్మికులకు శానిటైజర్ల పంపిణీ

by Shyam |
పారిశుధ్య కార్మికులకు శానిటైజర్ల పంపిణీ
X

దిశ, హైదరాబాద్: మేడ్చల్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు టీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం శానిటైజర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నోవెల్ కరోనా వైరస్(కొవిడ్ 19) విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెడుతూ మనమంతా కరోనా బారిన పడకుండా నిర్వహిస్తున్న సేవలు ఆదర్శనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ దీపికా నర్సింహారెడ్డ, గుండ్లపోచంపల్లి చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Tags:Sanitizer, Distribution, Municipal Staff, covid 19 effect, prevention

Advertisement

Next Story