ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా సందేశ్ ఝింగన్

by Shyam |
ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా సందేశ్ ఝింగన్
X

దిశ, స్పోర్ట్స్: భారత ఫుట్‌బాల్ జట్టు సీనియర్ డిఫెండర్ సందేశ్ ఝింగన్ ఏఐఎఫ్ఎఫ్ మెన్స్ ఫుట్‌బాల్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇక 2020-21 సీజన్‌కు గాను మిడ్‌ఫీల్డర్ సురేష్ సింగ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు గెలుచుకున్నాడు. 2014లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచిన సందేశ్.. ఏడేళ్ల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోవడం విశేషం. ఇండియన్ సూపర్ లీగ్, ఐ-లీగ్ క్లబ్ కోచెస్ కలిసి వేసిన ఓట్ల ద్వారా ఈ అవార్డుకు సందేశ్‌ను ఎంపిక చేశారు. సీనియర్ ఫుట్‌బాల్ జట్టుకు 2015లో అరంగేట్రం చేసిన సందేశ్.. ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లు ఆడి నాలుగు గోల్స్ చేశాడు. 2018లో ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు. అలాగే 2019లో ఖతార్‌లో జరిగిన ఆసియన్ చాంపియన్స్‌లో కూడా అతడు ఆడాడు. పలుమార్లు భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా సందేశ్ వ్యవహరించాడు. గత ఏడాది అతడికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. ఇక ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికైన సురేష్ ఈ ఏడాది తొలి సారిగా సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు.

Advertisement

Next Story