వాయిస్ ఆఫ్ లడఖ్.. వీడియో వైరల్

by Shyam |
వాయిస్ ఆఫ్ లడఖ్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా.. ఆర్మీ సేవలను కీర్తిస్తూ లడఖ్‌కు చెందిన ఇద్దరు కళాకారులు పాడిన ఓ పాపులర్ సాంగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు చెందిన పద్మ దోల్కర్, స్టాంజిన్ నోర్గయిస్ ఓ కొండ ప్రాంతం వద్ద కల్ట్ ఫిల్మ్ ‘బోర్డర్’లోని ‘సందేశే ఆతే హై’ పాటను ఆలపించారు. గిటార్ వాయిస్తూ స్టాంజిన్ పాడుతుండగా.. ఆయనకు సపోర్ట్‌గా పద్మ పాడిన తీరు పట్ల నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

1997లో వచ్చిన ఈ పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. పాటను ఫేమస్ మ్యూజిషియన్ సోనూ నిగం, రూప్ కుమార్ రాథోడ్ జంటగా ఆలపించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దోల్కర్, స్టాంజిన్‌ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి వీడియోను ట్విట్టర్ వేదికగా రీట్వీట్ చేసిన నటి రవీనా టాండన్.. ‘మేరా భారత్’ అంటూ కామెంట్ పెట్టింది. ఎంత అద్భుతంగా పాడారో! అంటూ ఒకరు కళాకారులను మెచ్చుకోగా.. వీరి కీర్తి లడఖ్‌కే పరిమితం కాకుండా అంతటా వినపడాలని పలువురు నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed