దళితుడిపై హీరో దాడి.. సెటిల్‌మెంట్ సెంటర్లుగా పోలీస్ స్టేషన్లు?

by Jakkula Samataha |
darshan
X

దిశ, సినిమా : శాండల్‌వుడ్ చాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ మరోసారి హెడ్ లైన్స్‌‌లో నిలిచాడు. మైసూర్‌లోని హోటల్ ‘సందేశ్ ది ప్రిన్స్‌’లో దళిత వెయిటర్‌పై దాడి చేసిన తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్, డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేశ్ డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హోమ్ మినిస్టర్ బసవరాజు బొమ్మైని కలిసిన డైరెక్టర్.. దర్శన్ చేసిన దాడిలో వెయిటర్ కంటి చూపు కోల్పోయాడని వివరించాడు. కాగా, ఈ హోటల్ జేడీఎస్ ఎమ్మెల్సీ సందేశ్ నాగరాజుకు చెందినదని, లేట్ నైట్ పార్టీలో ఇదంతా జరిగిందని చెప్పాడు.

ఆ తర్వాతి రోజు బాధితుడి భార్య హోటల్‌కు వచ్చిందని, తన భర్తపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిందని తెలిపాడు. అయితే దర్శన్ దోషి అని చెప్పేందుకు తన దగ్గర ఆధారాలున్నాయని మీడియా ముందు వివరించిన ఆయన.. దాడి జరిగిన రోజు హోటల్‌లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మిస్ అయిందని, ఇదెవరు చేసి ఉంటారని ప్రశ్నించాడు. సెలబ్రిటీలు సామాన్యులపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించాడు. కాగా దీనిపై స్పందించాడు దర్శన్.. తాను తప్పు చేస్తే ఇంద్రజిత్‌ ప్రూవ్ చేయొచ్చని, తనకు వ్యతిరేకంగా చాలా మంది పనిచేస్తున్నారని ఆరోపించాడు.

Advertisement

Next Story