- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీ నేతల అండ.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలోని పలు మండలాలలో వాగులు, కుంటలపై రైతుల సౌకర్యం కోసం చెక్ డ్యాంలు నిర్మించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే అనంతగిరి మండలంలో ఇప్పటికే పాలేరు వాగుపై పాలారం, శాంతినగర్, గోండ్రియాలలో మూడు చెక్ డ్యాంలను నిర్మిస్తున్నది. రైతుల సౌకర్యం కోసం వాగులలో వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసి, సమీపంలోని రైతులకు రెండు పంటలకు నీరందించేలా చేసేందుకు ఈ చెక్ డ్యాంలను నిర్మిస్తున్నారు. అయితే, వీటి నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా నిర్మిస్తున్నారు. దీనిపై ఆయా గ్రామాల రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక చెక్ డ్యాం నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక దందాకు తెరతీశారు. నిర్మాణాన్ని సాకుగా చూపి వాగులో ఇసుకను తోడి, వాటిని ఖమ్మం జిల్లా సరిహద్దుకు తరలించి, అక్కడ విక్రయించి, అక్రమంగా రాత్రివేళల్లో ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ, ఐబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
నిర్మాణం పేరుతో ఇసుక తోడివేత
చెక్ డ్యాం నిర్మాణం కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించి, ఆ ప్రాంతంలో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు కొంతమేర వాగులో ఇసుకను తొలగించాల్సి ఉంటుంది. అయితే నిర్దేశించిన ప్రమాణాల మేరకు కాకుండా, వాగులో ఇసుక మేటలు ఉన్న చోటల్లా ఇసుకను కాంట్రాక్టర్ అక్రమంగా తోడేస్తున్నారు. కాంట్రాక్ట్ నిబంధనల మేరకు ఈ ఇసుకను ప్రాజెక్టుల నిర్మాణంలో వాడకూడదు. ఇదే అదునుగా భావించి, ఈ ఇసుకను వేరొక ప్రాంతానికి తరలించి విక్రయిస్తున్నారు. ఈ విధంగా సదరు కాంట్రాక్టర్ ఖమ్మం జిల్లాకు ఇసుకను తరలించి విక్రయిస్తున్నాడు. ఈ వ్యవహారంపై పాలారంకు చెందిన కాసాని వెంకయ్య అనే రైతు కోదాడ ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. చెక్ డ్యాం నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నాడని, చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా అనంతగిరి మండల బీజేపీ నాయకులు సైతం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి, పనులలో నాణ్యత లోపిస్తున్నదని, కాంట్రాక్టర్ సాగిస్తున్న ఇసుక దందాను అరికట్టాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అయినా అయినా.. రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం సదరు కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడు కావడమేనని తెలుస్తున్నది. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతోనే ఆయన ఈ వ్యవహరాలను యథేచ్చగా కొనసాగిస్తున్నాడని, అందువల్ల అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి అనుమతులు లేవు : వాజిద్‌అలీ, తహసీల్దార్, అనంతగిరి
పాలేరు వాగుపై చెక్‌డ్యాంలు నిర్మిస్తున్న ప్రాంతం నుండి ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవు. ఇసుక అక్రమ రవాణా విషయం మా దృష్టికి రాలేదు. ఈ విషయంపై ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.