ఆ పనికి అడ్డొస్తున్నాడని.. అర్ధరాత్రి యువకుడిపై దాడి

by Sridhar Babu |   ( Updated:2021-11-03 00:40:55.0  )
Badhithudu-1
X

దిశ, ములకలపల్లి: మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ అక్రమ వ్యాపారానికి అడ్డుతగులుతున్నాడనే కారణంతో అర్థరాత్రి ఓ వ్యక్తి ఇంటిపై దాడిచేసి భయబ్రాంతులకు గురిచేశారు. ఇసుక మాఫియాతో తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ములకలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వీకే రామవరం గ్రామంలో కొందరు జట్టుగా ఏర్పడి గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బానోత్ చంద్రు అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందిస్తూ తమ అక్రమ వ్యాపారానికి అడ్డుతగులుతున్నాడని వారికి అనుమానం కలిగింది. దీంతో ఆ మాఫియా రెచ్చిపోయింది. మంగళవారం అర్ధరాత్రి చంద్రు ఇంటికి కొందరు వచ్చి మాట్లాడేది ఉంది బయటకు రావాలని వెంట తీసుకువెళ్లి విచక్షణా రహితంగా దాడికి దిగారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా తీవ్రంగా కొట్టారని, దీంతో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇసుక మాఫియాను కట్టడి చేయకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed